మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు

ప్రతి మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు ముఖ్యం. అయితే కొన్ని అలవాట్లు మనిషిని నాశనం చేస్తాయి. అలాంటి అలవాట్ల కారణంగా మనకు మనమే నాశనం అయిపోతాం. ఒకవేళ ఆ అలవాట్లు మీకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా… జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీకు గుణపాఠం నేర్పించడం ఖాయం. అవి ఏంటంటే… వాయిదా వేయడం, ఫిర్యాదు చేయడం, అతిగా ఆలోచించడం, పోల్చుకోవడం, సేఫ్ జోన్‌లో ఉండాలనుకోవడం.

వాయిదా వేయడం: ఏవేవో చేయాలనుకుంటాం. జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం. కానీ వాటిని రేపు, ఎల్లుండి, వారం, సంవత్సరం అంటూ వాయిదా వేసుకుంటూ ఉంటాం. పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక ఆ పని చేసి ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఫిర్యాదు చేయడం: ఇదో దరిద్రపు అలవాటు. మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం ఎదుటి వారి మీదనో, ఇంకేదో మీదనో ఫిర్యాదు చేస్తాం. ఈ భూమ్మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు. పర్‌ఫెక్టుగా ఉండే మనిషి పుట్టలేదు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉండటమో, తప్పు చేయడమో జరిగి తీరుతుంది. మనలోని ఏదైతే లోపమో, అవలక్షణమో, అసమర్థతో ఉంటే అది బయటి వాళ్ల మీద ఫిర్యాదులా మారుస్తాం

.✪ అతిగా ఆలోచించడం: కొందరు కొన్ని విషయాలకు అతిగా ఆలోచిస్తుంటారు. కొంచెం ఆలోచించమంటే భూతద్దం పెట్టి మరీ ఆలోచిస్తుంటారు. ఆలోచించే విషయం ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచన చేస్తారో కూడా బొత్తిగా అర్థం కాదు. ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుందంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని ఉండేవాళ్ళు. ఈ భూమ్మీద నువ్వో గెస్టువి మాత్రమే. కాబట్టి నీ బుర్రకి అతిగా పనిపెట్టకు.

పోల్చుకోవడం: ఇదో పనికిమాలిన అలవాటు. మనకు మనం ప్రతి విషయానికి ఇతరులతో పోల్చి చూసుకుంటాం. వాడు అంత సంపాదించాడు… ఆమె అన్ని నగలు కొనుగోలు చేసింది. వాడు అది కొనుక్కునాడు అంటూ పోల్చుకుని చూడందే మనకు పొద్దు గడవదు. సూది చేసే పని గునపం చేయలేదని… గునపం చేసే పని సూది చేయలేదని అందరూ గుర్తించి తీరాలి. దేని ప్రత్యేకత దానిదే. మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు. గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు. టాయిలెట్లు కడిగే వాని ప్రత్యేకత వేరు, విమానం నడిపే వాని ప్రత్యేకత వేరు. కాబట్టి మీ జీవితంలో ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకుని బాధపడుతూ కూర్చోమాకండి. ఈ భూమ్మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం. అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే.

సేఫ్ జోన్‌లో ఉండాలనుకోవడం: మనం ఏ పనిచేసినా సేఫ్‌గా పనిచేయాలని… రిస్క్ తీసుకోకూడదని భావిస్తూ ఉంటాం. భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు ఉంటే సేఫ్‌గా ఉంటామనో, ఇన్ని ఆస్తులు ఉంటే సేఫ్‌గా ఉంటామనో…లేకపోతే ఫలానా జాగాలో ఉంటే సేఫ్‌గా ఉంటామనో అనుకుంటుంటే… ముందు మీరు నిద్రలో నుంచి మేల్కొవాలి. సేఫ్ జోన్‌లో ఉండి నేర్చుకునేది ఏమీ ఉండదు.యుద్ధం చేసే వాడు గెలుస్తాడు. ఆడే వాడు గెలుస్తాడు. సేఫ్‌గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఎలాంటి పాఠాన్నీ నేర్చుకోలేడు.

Read Also: వైరల్: బైకుపై హీరో లెవల్లో గన్‌తో… కట్ చేస్తే…!

Related Articles

Latest Articles