Court Relies On DNA Test, Jails Man For Raping Step-Daughter: ముంబైలోని ప్రత్యేక కోర్టు డీఏన్ఏ పరీక్ష నివేదికపై ఓ కేసులో శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే 41 ఏళ్ల వ్యక్తి మైనర్ అయిన సవతి కూతురుపై 2019 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. జూన్ 2020లో బాలిక తల్లికి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తల్లికి తెలియజేసింది. అప్పటికే బాలిక 16 వారాల గర్భవతి. తరువాత గర్భాన్ని తీసేశారు.
అయితే ఈ కేసులో నేరానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు పోలీసులు. ఈ కేసులో నిందితుడిని గుర్తించేందుకు బాలిక పిండానికి డీఎన్ఏ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో తండ్రే ఈ అఘాయిత్యాని పాల్పడినట్లు తేలింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అనిస్ ఖాన్.. నిందితుడి నేరాన్ని గుర్తించేందుకు ఇటువంటి సందర్భాల్లో డీఏన్ఏ పరీక్షలు ముఖ్యమైన సాధనం అని పేర్కొన్నారు. బాధిత బాలిక పిండం యెక్క బయోలాజికల్ ఫాదర్ నిందితుడే అని డీఎన్ఏ పరీక్ష స్పష్టంగా సూచిస్తుందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న సవతి కూతురుపై సవతి తండ్రి ఇలా అఘాయిత్యానికి పాల్పడడాన్ని ఘోరమైన, తీవ్రమైన నేరంగా కోర్టు పేర్కొంది. నిందితుడు తమ కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక వ్యక్తి అని.. అతడిని క్షమించి జైలు నుంచి విడుదల చేయాలని బాలిక, ఆమె తల్లి కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు కోర్టు తెలిపింది. అయితే బాధితురాలిపై ఆమె తల్లి మానసిక ఒత్తడి చేయడం వల్లే ఈ కేసులో ఇలా చెబుతోందని కోర్టు పేర్కొంది. రక్త నమూనాల సేకరణ, ల్యాబ్ విశ్లేషన్ సరిగ్గా జరిగిందని.. తుది డీఎన్ఏ నివేదికను అంగీకరించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్షను విధించింది కోర్టు.