NTV Telugu Site icon

Asaduddin Owaisi: దేశానికి మోడీ బాబా అవసరం లేదు.. పార్లమెంట్‌లో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్‌లో రామ మందిర నిర్మాణం, జనవరి 22 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Bandi Sanjay: బండి సంజయ్ ఏం చేశాడు? వారికి సమాధానమే ఈ ప్రజాహిత యాత్ర

ఈ దేశానికి మతం లేదని నేను నమ్ముతున్నానని, జనవరి 22 ద్వారా ఈ ప్రభుత్వం ఒక మతం మరొక మతంపై గెలించిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా..? దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారంటూ మండిపడ్డారు. నేను బాబార్, జిన్నా లేదా ఔరంగాజేబు ప్రతినిధినా..? నేను రాముడిని గౌరవిస్తాను, అయితే నేను నాథురామ్ గాడ్సేను ద్వేషిస్తాను, ఎందుకంటే హే రామ్ చివరి మాటలుగా ఉన్న వ్యక్తిని అతను చంపాడు అని అసదుద్దీన్ అన్నారు.

మితవాద సంస్థలు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు డిసెంబర్ 6, 1992 తర్వాత దేశంలో అల్లర్లు జరిగాయని ఓవైసీ అన్నారు. యువకులను జైలులో పెట్టారని, వారు వృద్ధులైన తర్వాత బయటకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైసీ తన ప్రసంగానికి ముగించడానికి ముందు ‘‘బాబ్రీ మసీదు జిందాబాద్.. బాబ్రీ మసీదు ఉంది, ఎప్పటికీ ఉంటుంది’’ అని అన్నారు.