Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Controversy Erupted In The Lok Sabha Over The Naravane Book

Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం ఎందుకు? అసలు అందులో ఏముంది?

Published Date :February 3, 2026 , 11:14 am
By Suresh Maddala
  • నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం
  • రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం
  • ఇంతకీ పుస్తకంలో ఏముంది?
Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం ఎందుకు? అసలు అందులో ఏముంది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓ.. పుస్తకం పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. అధికార-ప్రతిపక్షాల మధ్య రగడ రాజేసింది. గంటల తరబడి సభ గందరగోళంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రస్తావించిన పుస్తకంలో అసలు ఏముంది? ఎందుకు కేంద్రం అడ్డుపడింది. ఈ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

సోమవారం పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీకి మాట్లాడే అవకాశం ఉంది. అంతకముందు బీజేపీ ఎంపీ సూర్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ వాదంపై విమర్శలు సంధించారు. దీనికి బదులుగా రాహుల్‌గాంధీ కౌంటర్ ఇస్తూ.. మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’లోని ఆత్మకథకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. 2020లో లడక్ ఘర్షణలపై నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ఒక మ్యాగజైన్ ప్రచురించిన విషయాలను ప్రస్తావించారు. దీంతో వెంటనే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌సింగ్ ‌సింగ్‌తో పాటు స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు.

ప్రచురణ జరగని అంశాలను సభలో లేవనెత్త వద్దని స్పీకర్ అడ్డుకున్నారు. సభా కార్యకలాపాలతో సంబంధంలేని ఇతర అంశాలను ఇక్కడ ప్రస్తావించొద్దని అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ కూడా అడ్డుతగిలారు. పుస్తకం ప్రచురణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ నిలదీశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

పుస్తకంలో అసలేముంది?
మనోజ్ నరవణే.. మాజీ ఆర్మీ చీఫ్. తన జీవితంలో జరిగిన అంశాలను ఆత్మకథగా రాసుకున్నారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, తూర్పు లడఖ్‌లో సైనిక చర్యలు, ప్రభుత్వ-సైన్యం మధ్య నిర్ణయం తీసుకునే ప్రక్రియ, వ్యూహాత్మక ఆలోచనలతో సహా అతని సైనిక అనుభవాలను వివరించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు డిసెంబర్ 2023లో మీడియాలో ప్రచురించబడ్డాయి. చైనాతో ఘర్షణ సమయంలో తలెత్తిన అంశాలను ప్రస్తావించారు. ఆ సమయంలో ‘నియంత్రణ’లో లేదని పేర్కొన్నారు. పుస్తకంలోని కొన్ని అంశాలు సున్నితంగా ఉన్నాయి. ఎందుకంటే.. జాతీయ భద్రత, వ్యూహాత్మక నిర్ణయాలు నేరుగా ప్రస్తావించబడ్డాయి. దీంతో అధికారికంగా ప్రచురణకు నోచుకోలేదు.

(ఎ) 1954 ఆర్మీ రూల్స్‌లోని సెక్షన్ 21 ప్రకారం..సర్వీస్ సబ్జెక్టులు, భద్రతా విషయాలపై ఎటువంటి విషయాలను ప్రచురించకూడదు. ఇక సైనిక సంబంధిత సమాచారాన్ని ప్రత్యక్షంగానీ.. పరోక్షంగానీ పత్రికలకు గానీ.. ఇతర ఏ రూపంలోనూ ప్రచురణ చేయకూడదు. ఇక కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పుస్తకం లేదా కథనాన్ని ప్రచురించకూడదు. ఇక సర్వీస్ సమాచారాన్ని కూడా ఎవరితో పంచుకోవడానికి వీలుండదు. ఇవన్నీ ఆర్మీ నిబంధనలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ అధికారికంగా ప్రచురణ జరగలేదు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం సమీక్షలో ఉండడంతో ప్రచురణ జరగలేదు.

ఇది కూడా చదవండి: Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్.. భర్త ఏమన్నారంటే?

అయితే రాహుల్‌గాంధీ జాతీయవాదం అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడుతూ. నరవణేకు సంబంధించిన అంశాలు ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైన అంశాలను లేవనెత్తారు. వెంటనే కేంద్రమంత్రులు అడ్డుతగిలారు. అంతేకాకుండా స్పీకర్ మైక్ కూడా కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన దిగారు. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర దుమారం రేపుతోంది.

ఇది కూడా చదవండి: Modi-Trump: భారత్-యూఎస్ మధ్య చిగురించిన మైత్రి.. సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు

What's Written In Gen. Naravane's Memoir That Scares The Life Out Of Modi Govt ❓❓ pic.twitter.com/afImest3iF

— Congress (@INCIndia) February 2, 2026

दिल्ली: लोकसभा स्पीकर ओम बिरला ने कहा, "…मैंने पहले ही रूल बुक पढ़ ली है। संसद में अखबार की कटिंग, किताबों कोई ऑथेंटिक विषय पर चर्चा की परंपरा नहीं रही है। नियम भी कहता है और यही परंपराएं भी यही है।"

(सोर्स: संसद टीवी) pic.twitter.com/ItLAjaXns4

— IANS Hindi (@IANSKhabar) February 2, 2026

“China was at the receiving end,” said the then Army Chief, Gen. M. M. Naravane.

Yet Rahul Gandhi refuses to trust the words of a former Army Chief. Time and again, he has chosen to undermine India’s official position and rely on foreign agencies to shape his political… pic.twitter.com/Zl3EadLEHr

— Amit Malviya (@amitmalviya) February 2, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • controversy
  • Lok Sabha
  • Manoj narwane
  • Naravane book
  • PM Modi

తాజావార్తలు

  • CSK vs PBKS: చెన్నైకి ధోనీ, శ్రేయాస్ డౌట్.. సీఎస్‌కే vs పంజాబ్ ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్!

  • Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

  • NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర

  • Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?

  • Pub Drugs Raid: పబ్ లో ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్..!

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions