Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళంలో ‘ఆవేశం’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంచలన దర్శకుడు జిత్తు మాధవన్, వెర్సటైల్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సీన్’. పూర్తిస్థాయి యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ఎన్వీఆర్ సినిమా’ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనుండటం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సూర్య సరసన క్యూట్ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 2డీ ఎంటర్టైన్మెంట్, జాగరం స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ వంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ వదిలిన టైటిల్ టీజర్ సినిమాలోని క్విర్కీ, ఎంటర్టైనింగ్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ అంచనాలను అమాంతం పెంచేసింది.
Also Read
- LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
- DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
- Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
- Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’ ఇన్స్టాంట్ హిట్‌గా నిలవగా.. సెకండ్ సింగిల్ ‘ఏరోప్లేన్’ అదిరిపోయే ఎనర్జీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వినీత్ అగస్టిన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్ ఈ నియో-యాక్షన్ కామెడీకి ప్రాణం పోయనున్నాయి. అజ్మల్ సాబు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. యాక్షన్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, నజ్రియా క్యూట్‌నెస్, ‘ఆవేశం’ దర్శకుడి మార్క్ టేకింగ్‌తో రాబోతున్న సూర్య ‘సీన్’.. ఈ నవంబర్ 6న థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన దీపావళి పండుగను అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
- Tags
తాజావార్తలు
-
Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!