L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
- మోహన్‌లాల్ ‘‘ఎంపురాన్’’పై రాజకీయ వివాదం..
- కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
L2: Empuraan: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా ‘ఎల్2:ఎంపురాన్’ వివాదానికి తెరతీసింది. కేరళలో అధికార కమ్యూనిస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాని స్వాగతించాయి. అయితే, అదే సమయంలో ‘‘సంఘ్ ఎజెండా’’ని సినిమా బహిర్గతం చేసిందని ఆ పార్టీలు, బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాయి. లూసిఫర్ సినిమా సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో పరోక్షంగా 2002 గుజరాత్ అల్లర్లను సూచిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఈ సినిమా చర్చించింది.
Read Also: Char Dham Yatra 2025: కేదార్‌నాథ్ సహా చార్‌ధామ్‌లో రీల్స్, యూట్యూబ్ వీడియోలపై బ్యాన్..
Also Read
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
దీంతో, రైట్ వింగ్ హిందుత్వ గ్రూపులు ఈ సినిమాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సినిమా ‘‘హిందూ వ్యతిరేక’’, ‘‘హిందూ దూషణ ప్రచార చిత్రం’’ అని పేర్కొంటున్నాయి. అయితే కమ్యూనిస్ట్, కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఈ సినిమాని ప్రశంసిస్తున్నాయి. కేరళ కాంగ్రెస్ యూత్ వింగ్ చీఫ్, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూట్టిత్ ‘ఎంపురాన్’ని పాన్ ఇండియా సినిమాగా కొనియాడారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ సుకుమారన్‌పై విద్వేషపూరిత ప్రచారాన్ని ఖండించారు. ‘‘కాశ్మీరీ ఫైల్స్’’, ‘‘కేరళ స్టోరీ’’ వంటి అబద్ధపు సినిమాలు, మతపరమైన ద్వేషం ఆధారంగా తీసిన సినిమాలను ప్రశంసించిన వ్యక్తులు, ఇప్పుడు ఎంపురాన్‌ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖతాలో బీజేపీ ఉద్దేశిస్తూ విమర్శలు చేసింది. కేరళ గడ్డపై ఎప్పుడూ అడుగుపెట్టని వారు, పన్నులు లేకుండా విడుదల చేసిన సీ-గ్రేడ్ ప్రచార సినిమాలు నిజమైన కేరళ స్టోరీ అని చెబుతున్నారు, ఇప్పుడు ప్రపంచస్థాయి మలయాళ సినిమా సంఘ్ ఎజెండాను, మన విస్తారమైన తీర ప్రాంతం, రెండు ప్రధాన ఓడరేవుల్ని నియంత్రించడాన్ని బహిర్గతం చేస్తే, ఇప్పుడు ఏడవడం ప్రారంభించారు అని ట్వీట్ చేసింది.
People who never stepped foot on Kerala’s soil were saying that a c-grade propaganda movie they released tax-free was the real Kerala story.
Now a world class film Malayalam movie exposed the Sangh agenda and the division they plan in Kerala to capture control of our vast… pic.twitter.com/zfVIKk4PXC
— Congress Kerala (@INCKerala) March 28, 2025
- Tags
- bjp
- congress
- Kerala
- L2 Empuraan
- Mohanlal
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!