NTV Telugu Site icon

Rahul Gandhi: ఎన్డీఏ పాలనతో మహారాష్ట్ర నుంచి 5లక్షల ఉద్యోగాలు తరలిపోయాయి

Rahulganhdi

Rahulganhdi

రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నందుర్‌బార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య పోటీ జరుగుతోందని తెలిపారు. తాను ర్యాలీల్లో ఎరుపు రంగు పుస్తకం ప్రదర్శించడంపై బీజేపీకి అభ్యంతరపడుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌కు రంగుతో సంబంధం లేకుండా రాజ్యాంగాన్ని కాపాడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి అవసరమైతే ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తాను చదవలేదని మోడీ భావిస్తుంటారని రాహుల్ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఎన్డీఏ పాలనతో మహారాష్ట్ర నుంచి 5లక్షల ఉద్యోగాలు తరలిపోయాయి

దేశాన్ని రాజ్యాంగం ప్రకారం నడపాలని కాంగ్రెస్, ఇండియా కూటమి భావిస్తుందని చెప్పారు. తన చేతిలో రాజ్యాంగం పుస్తకం ఉంటుందని ప్రధాన మోడీ విమర్శిస్తారన్నారు. ఎందుకుంటే మోడీ ఎప్పుడూ రాజ్యాంగం చదవలేదు కాబట్టే విమర్శిస్తుంటారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కుల గణన నిర్వహిస్తామని చెప్పారు. కుల గణన నిర్వహించి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. వివిధ పెద్ద ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు తరలించడంతో మహారాష్ట్ర నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు తరలిపోయాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Jagga Reddy: అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ నేతలే..!

మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మూడు రోజుల తర్వాత నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్డీఏ కూటమి నేతలు, ఇండియా కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.