NTV Telugu Site icon

TS Singh Deo: ప్రధానిపై సీఎం విమర్శలు, డిప్యూటీ సీఎం ప్రశంసలు.. కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెడుతున్నాడా..?

Congress 1

Congress 1

TS Singh Deo: కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ప్రధాని నరేంద్రమోడీపై భారీగా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కేంద్ర చేపడుతున్న ప్రాజెక్టులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’లకు ప్రధాని మోడీ గురువారం శంకుస్థాపను చేశారు. వీటితో పాటు ప్రధాని అనేక భారీ ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డియో మాట్లాడుతూ.. మీరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చలా ఇచ్చారని, భవిష్యత్తులో కూడా మీ సహకారం ఉంటుందని ఆయన ప్రధానిని ఉద్దేశిస్తూ అన్నారు. ప్రధాని ప్రకటించిన అన్ని ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేత ధన్యవాదాలు తెలిపారు. మేము కేంద్ర మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నామని, కేంద్రం నుంచి నిధులు అడగటానికి ఎలాంటి పక్షపాతంగా భావించనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని అన్నారు. ప్రధాని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రూ. 6400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.

Read Also: Himanta Biswa Sarma: మొత్తం కాంగ్రెస్ పార్టీని చంద్రుడిపైకి పంపిస్తా.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి..

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న టీఎస్ సింగ్ డియో, ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు కూడా ఇలాగే ఆయన ప్రధానిని ప్రశంసించారు. ఇప్పుడు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న భూపేష్ బఘేల్ కి, డియోకి పడదు. ఈ ఏడాది చివర్లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఉన్నపలంగా డియోను కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎంగా నియమించింది.

2018లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం టీఎస్ డియో, భుపేష్ బఘేల్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం బఘేల్ వైపు మొగ్గు చూపింది. డియోకు ఆరోగ్యశాఖను కేటాయించింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న ఈ సమయంలో డిప్యూటీ సీఎం ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తుండటం కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సీఎం బఘేల్ మాత్రం ప్రధానిని విమర్శిస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు పరస్పరం ఇలా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Show comments