TS Singh Deo: ప్రధానిపై సీఎం విమర్శలు, డిప్యూటీ సీఎం ప్రశంసలు.. కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెడుతున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Singh Deo: కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ప్రధాని నరేంద్రమోడీపై భారీగా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కేంద్ర చేపడుతున్న ప్రాజెక్టులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’లకు ప్రధాని మోడీ గురువారం శంకుస్థాపను చేశారు. వీటితో పాటు ప్రధాని అనేక భారీ ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డియో మాట్లాడుతూ.. మీరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చలా ఇచ్చారని, భవిష్యత్తులో కూడా మీ సహకారం ఉంటుందని ఆయన ప్రధానిని ఉద్దేశిస్తూ అన్నారు. ప్రధాని ప్రకటించిన అన్ని ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేత ధన్యవాదాలు తెలిపారు. మేము కేంద్ర మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నామని, కేంద్రం నుంచి నిధులు అడగటానికి ఎలాంటి పక్షపాతంగా భావించనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని అన్నారు. ప్రధాని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రూ. 6400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న టీఎస్ సింగ్ డియో, ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు కూడా ఇలాగే ఆయన ప్రధానిని ప్రశంసించారు. ఇప్పుడు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న భూపేష్ బఘేల్ కి, డియోకి పడదు. ఈ ఏడాది చివర్లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఉన్నపలంగా డియోను కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎంగా నియమించింది.
2018లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం టీఎస్ డియో, భుపేష్ బఘేల్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం బఘేల్ వైపు మొగ్గు చూపింది. డియోకు ఆరోగ్యశాఖను కేటాయించింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న ఈ సమయంలో డిప్యూటీ సీఎం ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తుండటం కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సీఎం బఘేల్ మాత్రం ప్రధానిని విమర్శిస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు పరస్పరం ఇలా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!