INDIA bloc: ఇండియా కూటమి నాలుగో సమావేశానికి తేదీ ఖరారు.? సీట్ల సర్దుబాటే ప్రధాన ఎజెండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: ప్రతిపక్షాల ఇండియా కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 19న ఢిల్లీ వేదికగా కూటమి నాలుగో సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షత వహించబోతోంది. ముందుగా ఈ సమావేశాన్ని గత బుధవారం నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే కీలక నేతలైన సీఎం మమతాబెనర్జీ, సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి వారు గైర్హాజరు అయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీని రద్దు చేశారు.
Read Also: CM Bhagwant Mann: “మేము సైలెంట్‌గా ఉన్నాం కాబట్టే సీఎం అయ్యాడు”.. పంజాబ్ సీఎం కూతురు సంచలన ఆరోపణలు..
Also Read
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
అయితే డిసెంబర్ 19న ఇండియా కూటమి సమావేశం జరగబోతున్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, నేతలు వస్తారా..? లేదా.? అనే అంశం ఆధారంగా భేటీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది, ఈ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకంపై కాంగ్రెస్‌తో ఇతర పార్టీలు సీట్ల పంపకంపై పట్టుబట్టే అవకాశం ఉంది. మరోవైపు కూటమిలో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్ వాదీల మధ్య సయోధ్య కూడా ఈ సమావేశంలో కీలకం కానుంది.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎన్సీపీ(శరద్ పవార్), శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆర్జేడీ, కమ్యూనిస్ట్ పార్టీలు, మరికొన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి పేరిట కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. కూటమి తొలిసమావేశాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాలో నిర్వహించగా.. బెంగళూర్‌లో రెండో సమావేశం, ముంబైలో మూడో సమావేశం జరిగింది.
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!