Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress To Take Out Nationwide Protests Against Amit Shah Remarks

Delhi: అమిత్ షా వ్యాఖ్యలపై 24న దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

Published Date :December 21, 2024 , 9:15 pm
By Suresh Maddala
  • అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనలు ఉధృతం
  • 24న దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
Delhi: అమిత్ షా వ్యాఖ్యలపై 24న దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజ్యసభలో అంబేద్కర్‌‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మరొకసారి దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. డిసెంబర్ 24న దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ‘‘బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్’’ నిర్వహించాలని పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ సర్క్యులర్ జారీ చేశారు. ఇక సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు డిసెంబర్ 22, 23 తేదీల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

డిసెంబర్ 24న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మార్చ్ ప్రారంభించాలని, జిల్లా మెజిస్ట్రేట్లకు మెమొరాండం సమర్పించేంత వరకూ మార్చ్ కొనసాగించాలని కేసీ.వేణుగోపాల్ సూచించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొంటారన్నారు.

డిసెంబర్ 18న రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఒక ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. దేవుడి పేరు పదే పదే తలుచుకుంటే కనీసం స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంబేద్కర్‌ను అమమానించినందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆరోపించారు. ఇరువర్గాల వారు పార్లమెంటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.

పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు. రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి డైవర్ట్ చేసేందుకే బీజేపీ ఎంపీలు దాడి అంటూ డ్రామాలాడారని ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah remarks
  • bjp
  • congress
  • nationwide protests
  • PM Modi

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions