Rahul Gandhi: రాహుల్ గాంధీకి సీటు కేటాయింపుపై వివాదం.. అసలు ప్రోటోకాల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
- రిపబ్లిక్ వేడుకల్లో రాహుల్ గాంధీ సీటు కేటాయింపుపై వివాదం..
- తమ నేతను మూడో వరసలో కూర్చోబెడుతారా అంటూ కాంగ్రెస్ ఆగ్రహం..
- అసలు ప్రోటోకాల్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: గణతంత్ర వేడుకల్లో లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు సీట్ల కేటాయింపు వివాదంగా మారింది. మూడో వరసలో వీరిద్దరికి సీట్లు కేటాయించారు. ఇలా తమ నేతలను మూడో వరసలో కూర్చోబెట్టడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని పార్టీ ఆరోపిస్తోంది. తమ పాలనలో ఎల్‌కే అద్వానీకి ముందు వరస సీటు కేటాయించామని చూపుతూ ఒక ఫోటోను కాంగ్రెస్ విడుదల చేసింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడి పట్ల ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం ప్రోటోకాల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆత్మన్యూనతా భావంతో బాధపడుతోందని, ఇది వారి నిరాశను వెల్లడిస్తుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. 2014లో ఎల్‌కే అద్వానీకి ముందు వరసలో సీటు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఒక ఫోటోను రిలీజ్ చేశారు. అయితే, దీనికి కౌంటర్‌గా 2014లో రాజ్యసభలో, లోక్‌సభలో ఎల్‌కే అద్వానీ ప్రతిపక్ష నేత కాదని, ఆ సమయంలో అరుణ్ జైట్లీ రాజ్యసభలో, సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని బీజేపీ చెప్పింది.
ప్రోటోకాల్ నిబంధనలు ఏం చెబుతున్నాయి.?
ఈ ఆరోపణలపై కేంద్రం అధికారికంగా స్పందించనప్పటికీ, ఇలాంటి కార్యక్రమాల్లో సీట్ల కేటాయింపులు రాష్ట్రపతి సెక్రటేరియట్ జారీ చేసిన ప్రాధాన్యతా ప్రకారం ఖచ్చితంగా ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకులు ప్రాధాన్యతా క్రమంలో 7వ స్థానంలో ఉంటారు.
దీనిని రాజకీయం చేయడంపై కాంగ్రెస్‌పై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘రాహుల్ గాంధీ మూడో వరుసలో కూర్చోవడం గురించి ఆందోళన చెందడం లేదు, కర్తవ్యపథ్‌లో దేశం బ్రహ్మోస్ క్షిపణులను సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో తను ఫోన్‌ను చూస్తూ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
This was in 2014—look at where LK Advani ji was seated then.
Why this protocol mess-up now?
Is it because Modi and Shah want to insult Kharge ji and Rahul ji?Leaders of the Opposition cannot be insulted like this, especially on Republic Day.#RepublicDay https://t.co/1zUMsILyDX pic.twitter.com/tPOlpaGKTG
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) January 26, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!