NTV Telugu Site icon

Mallikarjun Kharge: మోసం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రశంసలు కోరుకుంటున్నారు

Mallikarjunkharge

Mallikarjunkharge

కేంద్ర బడ్జెట్‌పై  విపక్షాలు పదవి విరిచాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాత్రం బడ్జెట్‌ను తప్పుపట్టారు. యావత్‌ దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే.. ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో బిజీగా ఉందని ఖర్గే విమర్శించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రజలను మోసం చేసేలా ఉందని ధ్వజమెత్తారు.

గత పదేళ్లల్లో మధ్యతరగతి ప్రజల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.54.18 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేశారన్నారు. ఇప్పుడు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చి.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సగటున ఏడాదికి రూ.80 వేలు ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాడుతుంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం ప్రశంసల కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి: Pakistan: కాల్పులతో దద్ధరిల్లిన బెలూచిస్తాన్.. 18 మంది సైనికులు, 12 మంది ఉగ్రవాదులు హతం..

ఇక ఈ బడ్జెట్‌లో యువతకు, మహిళలకు మొండిచేయి చూపించారని వ్యాఖ్యానించారు. అన్నదాతలు, దళితులు, మైనార్టీలు, పిల్లలకు విద్య, ఆరోగ్యం గురించి ప్రస్తావనే లేదన్నారు. పన్ను శ్లాబును హైలెట్ చేసి గొప్పగా చెప్పుకొంటున్నారని ఖర్గే విమర్శించారు.

శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Ultraviolette SuperStreet: దుమ్మురేపే ఫీచర్లతో సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో 323KM రేంజ్!