భారీ వర్షాల్లోనే బాలీవుడ్ షూటింగ్స్…

ముంబై మహానగరానికి వరుసగా సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా కేసులు అక్కడే వచ్చాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రెండూ ముంబైనే టార్గెట్ చేశాయి. ఆ ఎఫెక్ట్ విపరీతంగా పడింది బాలీవుడ్ మీద! రెండు సంవత్సరాలుగా బీ-టౌన్ పదే పదే చతికిలపడుతోంది. అయితే, రీసెంట్ గా లాక్ డౌన్ ఎత్తేశాక మాత్రం బాలీవుడ్ బడా స్టార్స్ అందరూ ఒకేసారి బరిలోకి దిగారు. చకచకా షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే, ఇంతలో భారీ వర్షాలు బాలీవుడ్ ను మరోసారి గజగజ వణికించే ప్రయత్నం చేశాయి…

ఈ మధ్య కురిసిన విపరీతమైన వర్షాలతో ముంబై ఎటు చూసినా జలమయం అయిపోయింది. అయినా కూడా కొందరు బీ-టౌన్ బిగ్ స్టార్స్ తమ షెడ్యూల్స్ ఆపలేదట. ముఖ్యంగా, ‘బచ్చన్ పాండే’ సినిమా చివరి షెడ్యూల్ కొనసాగిస్తోన్న అక్షయ్ కుమార్ హోరు వర్షాల మధ్యనే జోరుగా యాక్షన్ పూర్తి చేసేశాడట. ముంబైలో బయట ఎలాంటి పరిస్థితి ఉన్నా ‘బచ్చన్ పాండే’ సెట్ లో మాత్రం బయో బబుల్ ఏర్పాటు చేసుకుని చిత్రీకరణ ముగించారట. సినిమాలో ఖిలాడీ స్టార్ సరసన కృతీ సనన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘బచ్చన్ పాండే’ తమిళ చిత్రం ‘జిగర్ తాండ’కి హిందీ రీమేక్…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-