NTV Telugu Site icon

Congress: జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. లోక్‌సభలో నోటీసు

Minish Tiwari

Minish Tiwari

Congress: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్‌లోని రూల్ 72 ప్రకారం రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత బిల్లుపై తన అభ్యంతరాలతో పాటు రాజ్యాంగబద్ధతకు భంగం వాటిల్లుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉందని లోక్ సభలో ఇచ్చిన నోటీసులో వెల్లడించారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశం, దాని సమాఖ్య లక్షణాన్ని ధృవీకరిస్తూ రాష్ట్రాలు యూనియన్‌గా ఉండాలని నిర్ధారిస్తుంది అని మనీష్ తివారీ పేర్కొన్నారు.

Read Also: TTD Update: శ్రీవారి భక్తుల అలర్ట్.. రేపటి నుంచి ఆర్జిత సేవా టికెట్లు!

కానీ, ఈ రాజ్యాంగ (129) సవరణ బిల్లుతో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలను ప్రతిపాదిస్తూ.. రాష్ట్రాలపై అధిపత్యం చెలాయించేలాఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఆరోపించారు. ఈ జమిలి ఎన్నికల ద్వారా రాష్ట్రాలు వాటి స్వయం ప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే, రాజ్యాంగంలో పొందుపరచబడిన ఫెడరలిజం, ప్రజాస్వామ్య సూత్రాలను ప్రాథమికంగా బలహీనపరుస్తుంది అని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మరింత ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చెప్పుకొచ్చారు.

Show comments