కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… 2017 ఉన్నావ్ అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా… ఇప్పుడు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంది. 19 ఏళ్ల బాధితురాలి తల్లి పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు విడుదల చేశారు. బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.. మీరు వేధింపులు, చిత్రహింసలకు గురైనట్లయితే, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మా జాబితా కొత్త సందేశాన్ని పంపుతుందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు..
Read Also: ఈ సారి ఐపీఎల్ అక్కడేనా..?
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇక, మహిళలకు నలభై శాతం టిక్కెట్లు రిజర్వ్ చేశామని ప్రియాంక తెలిపారు.. ప్రజల సమస్యలపై పోరాడాలని అభ్యర్థులకు సూచించిన ఆమె.. ప్రతికూల ప్రచారాలకు తావివ్వబోమని, దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిపైనే మా ప్రచారం ఉంటుందన్నారు.. యూపీలో నేను ప్రారంభించిన పనిని కొనసాగిస్తాను.. ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలోనే ఉంటానన్న ఆమె.. యూపీలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం అన్నారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం బయట బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉన్నావ్ రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. సెంగార్ సోదరుడు తన 55 ఏళ్ల తండ్రిని కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరుసటి రోజు అతను మరణించాడు, అతనికి తగిలిన గాయాల కారణంగా చనిపోయినట్టు నివేదికలు స్పష్టం చేశాయి.. అయితే, ఆ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు, సంస్థలు, ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!