కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఇది భారత్ కోవిడ్ వేరియంట్ అంటూ కథనాలు వచ్చాయి.. చాలా మంది నేతలు విమర్శలు చేశారు.. అయితే, ఈ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది.. అంతేకాదు.. అది భారత్ వేరియంట్ అంటూ ఉండే కంటెంట్ మొత్తం తొలగించాలంటూ.. అన్ని సోషల్ మీడియా సంస్థలను కోరింది. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని, అపఖ్యాతి పాలైందంటూ ఆయన కామెంట్ చేశారు.. భారత ప్రజలపై అన్ని దేశాలూ నిషేధం విధించాయని, అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కమల్‌నాథ్.. భారత్ గొప్ప దేశం కాదని నేనంటున్నాను.. భారత్ అపఖ్యాతి పాలైంది.. భారత పౌరులపై అన్ని దేశాలూ బ్యాన్ విధిస్తున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించడం.. మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పై వ్యాఖ్యలుచేశారు.. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిపోయాయి.