NTV Telugu Site icon

PM Modi: దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..

Pm

Pm

PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో విమర్శలు చేశారు. ఓటముల్లో కాంగ్రెస్ షోలే రికార్డులను కూడా దాటేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో్ కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా ఓ పాఠం నేర్పిందని చెప్పారు. ఎన్డీయేను ఓడించామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని, వారు ఓటమిపై అంతర్మథనం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మిత్ర పక్షాల సాయంతో కొన్ని సీట్లను గెలుచుకుందాని అన్నారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదని చెప్పారు. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ కేవలం 26 శాతమే అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ జూనియర్ పార్ట్‌నర్‌గా మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రతీ ఎన్నికల్లో మిత్రపక్షాల ఓట్లను తినే పరాన్నజీవి అని అన్నారు.

Read Also: Assam Flood: అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు.. 45కి చేరిన మృతులు

రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ, ఆయన సభలో కన్నుకొడుతారు, కౌగిలించుకుంటారు, చిన్నపిల్లాడి మనస్తత్వమని, ఆయనకు పరిపక్వత లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తోందని, అలాంటి వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చిందని అన్నారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించారు. వారు కోరుకున్న ఫలితాలు రాకుంటే జూన్ 4న దేశాన్ని తగలబెట్టాలని అనుకున్నట్లు పలు వేదికల నుంచి ప్రకటించిందని చెప్పారు. అరాచకాన్ని వ్యాప్తి చేయాలని చూశారని అన్నారు. భాషా ప్రాతిపదికన ఉత్తరాది, దక్షిణాదిని విభజిస్తోందని, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కూడా ఇదే విధంగా ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు.

సానుభూతి పొందేందుకు కొత్త డ్రామాలకు కాంగ్రెస్ తెరతీసిందని ప్రధాని మోడీ అన్నారు. వేల కోట్ల అవినీతి కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై ఉన్నారని, ఓబీసీ ప్రజలను దొంగలన్న కేసులో బాధ్యతరాహిత్యంగా మాట్లాడినందుకు సుప్రీంకోర్టులో క్షమాపనలు చెప్పాల్సి వచ్చిందని ప్రధాని అన్నారు.