PM Modi:రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.