NTV Telugu Site icon

Haryana: హర్యానాలో కుదిరిన ఆప్-కాంగ్రెస్ పొత్తు..! ఎవరికెన్ని సీట్లంటే..!

Congressapp

Congressapp

హర్యానాలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల పంపకం పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాల తర్వాత సీట్ల పంపకాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆప్ 10 సీట్లు అడగ్గా.. ఐదు నుంచి ఏడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఒక సీటు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కమ్యూనిస్టులకు కూడా ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇండియా కూటమి సభ్యులు ఐక్యంగా పోటీ చేసి బీజేపీని ఓడించాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: AI: ఏఐ వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారా?

హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. సమయం లేనందున సీట్ల పంపకాలపై ఇండియా కూటమి ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌లు బుధవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఓట్ల విభజన జరగకుండా కాపాడుకునేందుకు కూటమిని కొనసాగించాలని రాహుల్ గాంధీ కోరినట్లు వర్గాలు తెలిపాయి. 2024 హర్యానా లోక్‌సభ ఎన్నికల్లో, కాంగ్రెస్ మరియు ఆప్ రాష్ట్రంలోని 10 స్థానాల్లో 9:1తో పోటీ చేశాయి. కాంగ్రెస్ తన వాటాలో ఐదు గెలుచుకుంది. AAP తాను పోటీ చేసిన ఒక సీటు కురుక్షేత్ర బీజేపీకి చెందిన నవీన్ జిందాల్ చేతిలో దాదాపు 29,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. రెండు పార్టీలకు వరుసగా 21.19 శాతం, 1.11 శాతం ఓట్లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Italy: ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి మృతి

Show comments