హర్యానాలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల పంపకం పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాల తర్వాత సీట్ల పంపకాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆప్ 10 సీట్లు అడగ్గా.. ఐదు నుంచి ఏడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.