PoK: పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) భారత్‌లో విలీనం అవుతుంది.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్‌లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాశ్మీర్‌పై పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘వాళ్లు కాశ్మీర్‌ని ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా.? వారు పీఓకే గురించి ఆందోళన చెందాలి. అక్కడి ప్రజలు భారత్‌లో విలీనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోందని నేను ఏడాదిన్నర క్రితమే చెప్పాను’’అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ప్రభుత్వం ఏదైనా ప్రణాళికను రూపొందిస్తుందా?? అనే ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇంకేమి చెప్పను. మేం ఏ దేశంపైనా దాడి చేయబోవడం లేదు. ప్రపంచంలో ఏ దేశంపైనా దాడి చేయని లక్షణం భారత్‌కి ఉంది. ఇతర దేశాలకు చెందిన అంగుళం భూమిని భారత్ ఎప్పుడూ ఆక్రమించలేదు. కానీ పీఓకే మనది, అది స్వయంగా భారత్‌లో విలీనం అవుతుందనే నమ్మకం నాకు ఉంది’’ అని చెప్పారు. ఫిబ్రవరి నెలలో పీఓకేలోని రాజకీయ కార్యకర్త అమ్జద్ అయూబ్ మీర్జా ఓ వీడియోలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ తీరుతో పీఓకే ప్రజలు విసిగిపోయారని, వారు ఇప్పుడు భారత్‌లో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read
- Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
Read Also: Kamal Haasan: రాముడు అగ్నిపరీక్ష నిర్వహించినట్లే.. ఈవీఎంలను పరీక్షిస్తాం..
భారత్‌పై చైనా దాడి చేస్తుందా..? అని అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి తప్పులు చేయవద్దనే బుద్ధి ఆ దేశానికి ఇవ్వాలని, ఏ దేశంపైనా దాడులు చేయని గుణం భారత్‌లో ఉందని, అయితే మన దేశంపై దాడి చూస్తే మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. మన పొరుగువారితో మంచి సంబంధాలు ఉండాలని ఆయన కాంక్షించారు. దేశం ప్రతిష్టపై, దేశంపై దాడి చేసేవారికి బుద్ధి చెప్పే శక్తి భారత్‌కి ఉందన్నారు. చైనా నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనే సత్తా భారత్‌కి ఉందన్నారు. భారత్ బలహీన దేశం కాదని, ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారిందని అన్నారు.
మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను వేగవంతం చేసిందని రాజ్ నాథ్ చెప్పారు. జవాన్ల త్యాగాలను రాహుల్ గాంధీ లాంటి వారు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. గాల్వాన్ పోరాటంలో మన జనాన్లు 20 మంది మరణించారు. అయితే, విదేశీ సంస్థలు మాత్రం ఈ ఘర్షణలో 35 నుంచి 40 మంది చైనా సైనికులు మరణించినట్లు చెబుతున్నాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!