Coin Stuck In Throat: బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణేం..7 ఏళ్ల తర్వాత తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coin Stuck In Throat: 12 ఏళ్ల బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణేన్ని ఏడేళ్ల తర్వాత తొలగించిన అరుదైన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. హర్డోయ్ జిల్లా ఆస్పత్రిలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వివేక్ సింగ్ మరియు అతని బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యలు బృందం విజయవంతంగా నాణేన్ని తొలగించింది. ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నొప్పి, వేదన నుంచి బాలుడు విముక్తి పొందాడు.
Read Also: Kangana Ranaut: కంగనాని చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్కి మద్దతుగా రైతుల సంఘాల నిరసన..
Also Read
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
- K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
రాష్ట్రంలోని బఘౌలీలోని మురళీపూర్వ గ్రామానికి చెందిన అంకుల్ అనే బాలుడికి ఏప్రిల్లో కడుపునొప్పి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేట్ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నప్పటికీ, జూన్ 4న అతను గొంతు నొప్పిగా ఉందని చెప్పడంతో అతని తాత అతడిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించిన తర్వాత బాలుడి గొంతులో రూపాయి నాణేం ఇరుక్కుని ఉందని చెప్పారు. టెలిస్కోప్ పద్దతిని ఉపయోగించి సర్జరీ చేసిన వైద్యులు నాణేన్ని తొలగించారు.
ఏడేళ్ల పాటు బాలుడి గొంతులోనే నాణేం ఇరుక్కుపోయి ఉందని, ఇలాంటివి చూడటం చాలా అరుదని, ఇది బాలుడి ఎదుగుదలను మాత్రమే కాకుండా అతని శారీరక ఎదుగుదలను కూడా ప్రభావితం చేసింది, పిల్లాడు 12 ఏళ్ల వయస్సున్న పిల్లాడిలా లేదని డాక్టర్ వివేక్ సింగ్ చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ అని, తొలగించిన తర్వాత కూడా అబ్బాయికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో రెగ్యులర్ చెకప్కి రావాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ రిలీజ్.. సమంత పవర్ఫుల్ యాక్షన్ హైలైట్
-
Astrology: మే 26 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?