Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- సోషల్ మీడియాలో ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ ట్రెండ్..
- మెజారిటీ ఫాలోవర్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లే..
- కొత్త వాదనను ఎత్తి చూపుతున్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల్లోనే 15 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. రాజకీయ వ్యంగ్యాస్త్ర వేదికగా ప్రారంభమైన సీజేపీ అనతి కాలంలోనే దేశంలోని సంచలనంగా మారింది. అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు దాటి సంచలనం సృష్టించింది.
అయితే, ఈ రేంజ్లో ఫాలోవర్లు పెరిగిపోవడంపై భారత్‌లోని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు సీజేపీ ఫాలోవర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలను ఇందుకు ఆధారంగా చూపిస్తు్న్నారు. సీజేపీ ఫాలోవర్లలో ఎక్కువ మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన వారని చెబుతున్నారు. భారత్ నుంచి కొద్ది మాత్రమే ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్, మెటా అధికారికంగా ధ్రువీకరించలేదు.
Also Read
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్‌లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్‌చుక్ భార్య..
- Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
పాకిస్తాన్ ఫాలోవర్లే ఎక్కువా..?
కొంతమంది ఎక్స్ యూజర్లు సీజేపీ ఫాలోవర్లలో 77 శాతం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారని చెబుతున్నారు. భారత్ నుంచి కేవలం 9 శాతం మంది మాత్రమే ఉన్నారని పోస్టులు చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఎస్‌డీపీఐల మద్దతుదారులు ప్రమోట్ చేస్తు్న్నారని ఆరోపిస్తున్నారు. తక్కువ కాలంలో ఇంత మంది ఫాలోవర్లు రావడం వెనక బాట్ అకౌంట్లు లేదా ఇన్‌యాక్టివ్ లేని అకౌంట్లు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
ఎలా మొదలైంది, ఎవరు ప్రారంభించారు.?
ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలకు సెటైర్‌గా ఈ సీజేపీ ప్రారంభమైంది. మే 15న జరిగిన ఒక విచారణలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ ఉన్న ఉద్యోగాలు చేయని వారిని ‘‘బొద్ధింకలు’’, ‘‘పారసైట్’’లు అంటూ వ్యాఖ్యానించారే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఆయన మరోసారి స్పష్టతను ఇస్తూ తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను యువతను అనలేదని, నకిలీ డిగ్రీలతో జాబ్స్ చేసేవారిని ఉద్దేశించి అన్నానని చెప్పారు.
ఈ డిజిటల్ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వర్కర్ అభిజిత్ దీప్కే ప్రారంభించారు. అయితే, ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న సీజేపీ అకౌంట్‌ను ఎక్స్‌లో నిలిపేశారు. తాము ముందే ఊహించినట్లు సీజేపీని భారత్‌లో నిలిపేశారని దీప్కే అన్నారు. ఇదిలా ఉంటే ఈ సీజేపీ కొన్ని రాజకీయ డిమాండ్లు కూడా చేసింది. రిటైర్మెంట్ తర్వాత చీఫ్ జస్టిస్‌లకు రాజ్యసభ పదవులు నిషేధం, పార్టీలు మారిన వారికి 20 ఏళ్లు ఎన్నికల్లో నిషేధం, పార్లమెంట్, కేంద్ర కేబినెట్లో 50 శాతం మహిళా రిజర్వేషన్, అంబానీ అదానీల యాజమాన్యంలోని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని నినదించింది.
Pakistan Janta Party pic.twitter.com/Abdlqm0AsL
— Tajinder Bagga (@TajinderBagga) May 21, 2026
తాజావార్తలు
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్‌ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!