పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌లో భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) నిర్వహిస్తున్న బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బోర్డిలా ప్రాంతంలో పెద్ద బొగ్గు గని అకస్మాత్తుగా కూలిపోవడంతో అనేక మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో వెంటనే సహాయక బృందాలు, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే బొగ్గు గనిలో ఎంత మంది చిక్కుకున్నారన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Iran: రక్తసిక్తంగా ఇరాన్.. పారిపోయేందుకు ఖమేనీ ఏర్పాట్లు.. ఏ దేశానికంటే..!
అయితే ఇది అక్రమ మైనింగ్ గని సమాచారం. అక్రమ తవ్వకాల కారణంగా ఒక్కసారి కూలిపోయిట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం భారీ యంత్రాలు సంఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఇది కూడా చదవండి: US – Iran Tensions: ఇరాన్‌పై దాడికి అమెరికా ప్లాన్.. దాడి చేసేది ఇక్కడి నుంచే!
#WATCH | West Bengal: A coal mine collapsed in a mining area in Asansol earlier today. BJP MP Ajay Poddar says that three bodies have been recovered from here. pic.twitter.com/VlTpS0ZNYV
— ANI (@ANI) January 13, 2026