NTV Telugu Site icon

Yogi Adityanath: సంభాల్‌ అల్లర్లపై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..

Yogi

Yogi

Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభాల్‌ అల్లర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అయోధ్య, ఇప్పుడు సంభాల్‌, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు అన్ని చోట్లా ఉన్నారు.. వాళ్లతో చాలా ప్రమాదం అన్నారు. సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ రాముడని పేర్కొన్నారు. కులం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించి మన మధ్య ఉన్న ఐక్యతను నీరుగార్చేందుకు.. కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విపక్ష పార్టీలపై యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: TGRTC New Logo: రవాణా శాఖ కొత్త లోగో విడుదల.. ఆర్టీసీ విజయాలపై బ్రోచర్

అయితే, బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిస్థితులను సైతం ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. అక్కడి మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందూ సన్యాసి చిన్మయ్‌ కృష్ణదాస్‌పై దేశ ద్రోహం నేరారోపణలు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు. అక్కడి మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.. సంభాల్‌లో అల్లర్ల వెనుక బీజేపీ ప్రమేయం ఉందంటూ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన ఆరోపణలనూ ఆదిత్యనాథ్‌ ఖండించారు.

Read Also: Pushpa 2: ‘పుష్ప 2’ వేయలేదని థియేటర్ పై రాళ్ల దాడి

ఎస్పీ నేతలు సోషలిస్టు సిద్ధాంత కర్త రామ్‌ మనోహర్‌ లోహియా గురించి మాట్లాడతారు.. తప్పా, ఆయన భావజాలాన్ని మాత్రం అనుసరించరని యూపీ సీఎం ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఇప్పటి సోషలిస్టులు రాజ వంశీయులు, గూండాలు, నేరస్తుల సపోర్టు లేకుండా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేరని పేర్కొన్నారు. వాళ్లే లేకపోతే నీటిలో నుంచి తీసేసిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటారని యోగి ఎద్దేవా చేశారు.