Haryana CM Meet PM Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మూడోసారి గెలిచి కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించింది. ఈ సందర్భంగా ఈరోజు (బుధవారం) హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో బీజేపీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిగ్ ఫిగర్ ను దాటడంతో.. తనను మరోసారి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించాలని సీఎం సైనీ కోరే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు కొత్త మంత్రివర్గాన్ని ఖరారు చేయడంపై పార్టీ హైకమాండ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.
Read Also: Hardik Pandya: బంగ్లా చిన్న జట్టు.. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు: ఆర్పీ సింగ్
అలాగే, హర్యానాలో మరోసారి భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేసిన ఓటర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించినందుకు ఆయనను ప్రశంసించారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ సుపరిపాలన వల్లే అన్ని వర్గాలకు చెందిన ప్రజల ఓట్లు పార్టీకి వేశారని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: JC Prabhakar Reddy: రోడ్లపై చెత్త వేస్తే కేసులు.. పరిశ్రమలకు కరెంట్ కట్.. జేసీ వార్నింగ్
ఇక, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ ట్రెండ్స్‌లో తొలుత ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 37 సీట్లతో సరిపెట్టుకుంది. INLD రెండు స్థానాలను గెలుచుకోగా.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చలు విఫలమవడంతో ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌కు ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. 2019లో 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ కూడా ఈసారి ఖాతా తెరవలేకపోయింది.
#WATCH | Delhi: Haryana CM Nayab Singh Saini leaves from 7 LKM, the residence of Prime Minister Narendra Modi.
BJP is set to form the government in Haryana for the third consecutive term. pic.twitter.com/TmVDkb0PxY
— ANI (@ANI) October 9, 2024