Devendra Fadnavis: రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించారు, అందుకే ఆయనకు కోపం..
- రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ ఆరోపణలపై ఫడ్నవీస్ ఫైర్..
- రాహుల్‌ని ప్రజలు తిరస్కరించారు..
- మహారాష్ట్రని అవమానిస్తే చూస్తూ ఊరుకోం అంటూ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ నిరంతరం ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానిస్తున్నారు. ఆయన ప్రజాతీర్పును పదే పదే అగౌరపరుస్తున్నారు. ప్రజలు రాహుల్ గాంధీని తిరస్కరించారు. ప్రతీకారంగా ఆయన ప్రజల్ని తిరస్కరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీని మరింత క్షీణతలోకి నెట్టివేస్తుంది’’ అని ఫడ్నవీస్ అన్నారు.
దీనికి ముందు, శనివారం రోజు రాహుల్ గాంధీ ఒక వార్తా పత్రిక కథనంలో.. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘‘ప్రజాస్వామ్యాన్ని మోసగించడానికి ఒక ప్రణాళిక’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ‘‘మ్యాక్ ఫిక్సింగ్’’ జరిగినట్లు బీహార్ లో కూడా చేస్తారని ఆయన ఆరోపించారు. అయితే, రాహుల్ గాంధీ వాదనల్ని ‘పూర్తిగా అసంబద్ధం’’ అని కేంద్రం ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
Read Also: Covid-19 Cases: దేశంలో 6000 మార్కును దాటిన కరోనా కేసులు..
దీనికి కౌంటర్‌గా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం వార్తా కథనంలో రాహుల్ గాంధీ తీరును ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై నిరంతరం సందేహాలు వ్యక్తం చేయడం ద్వారా, దేశాన్ని ఎటు వైపు తీసుకెళ్తున్నారు..? ఎలాంటి విషాన్ని వ్యాపింపచేస్తున్నారు..?’’ అని అడిగారు. ‘‘మహారాష్ట్రలో ఓటమి ఎంత తీవ్రంగా బాధించిందో నాకు అర్థమైంది. కానీ మీరు రైతులు, మహిళలు, పౌరులు,మహారాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని ఇలా అవమానించడం కొనసాగిస్తే, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. ముఖ్యమంత్రిగా, ప్రజా సేవకుడిగా, మహారాష్ట్ర ప్రజలకు జరిగిన ఇటువంటి అవమానాన్ని నేను ఎల్లప్పుడూ ఖండిస్తాను” అని ఫడ్నవిస్ అన్నారు.
గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 సీట్లకు గానూ 235 సీట్లను గెలుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని కాంగ్రెస్-16, శివసేన (ఠాక్రే)-20, శరద్ పవార్ ఎన్సీపీ-10 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆరు దశాబ్ధాలలో తొలిసారిగా ప్రతిపక్ష నాయకుడి హోదా పొందలేకపోయారు.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!