CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
- సీజేపీకి బిగ్ షాక్..
- ముందుస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులో దీప్కే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ‘లెహ్రా దో తిరంగా’’ పేరుతో జాతీయ జెండా ర్యాలీకి బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు ఈ చర్య తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో తాను ఏం చేశానని అదుపులోకి తీసుకుంటున్నారని పోలీసుల్ని దీప్కే ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వారం వ్యవధిలో దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో ఓటర్లను తొలగించారని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ పోలీసులు విమానంలోనే అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
అక్టో్బర్ 16న ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా ర్యాలీకి సీజేపీ పిలుపునిచ్చింది. అంతకుముందు ఈ ర్యాలీ నిర్వహించొద్దని దీప్కే నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అందించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 కింద జారీ చేసిన ఈ నోటీసులో కనాట్ ప్లేస్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మార్చ్‌కు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం ఆంక్షల్ని ఉల్లంఘించడమే అవుతుందని హెచ్చరించారు.
#WATCH | Delhi | As CJP Founder Abhijeet Dipke leaves from the residence of NCP-SCP spokesperson Anish Gawande, a police official says, "We are placing you under preventive detention. Section 163 is in force in Connaught Place. You are being detained…"
CJP has called for ‘Lehra Do Tiranga’ protest at Central Park in Connaught Place today.
— ANI (@ANI) October 16, 2026
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!