దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టిపీడిస్తోంది. గత కొద్దిరోజులుగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన గాలి లేక ప్రజలు నానా యాతన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఇది కూడా చదవండి: UP: భార్య రహస్యంగా ఫోన్ మాట్లాడుతుందని భర్త మాస్టర్ ప్లాన్.. అచ్చం సినిమా మాదిరిగా..!
తాజాగా ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు తాత్కాలిక పరిష్కారం కాకుండా.. దీర్ఘకాలిక పరిష్కారం వెతకాలన్నారు. ఇందుకోసం పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Putin-Bush: వెలుగులోకి 20 ఏళ్ల నాటి పుతిన్-బుష్ సంభాషణ.. పాక్ గురించి ఏం చర్చించారంటే..!
ఢిల్లీ కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అయినా కూడా కాలుష్యం కంట్రోల్ కాలేదు. పాత వాహనాలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇక పొల్యుషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ నిషేధం విధించారు. ఇక టోల్‌ప్లాజ్‌లు మూసేశారు. అయినా కూడా కాలుష్యం తీవ్రత తగ్గలేదు. ప్రమాదకర స్థితిలో కొనసాగుతోంది.