బీహార్‌లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు.
ఇది కూడా చదవండి: Delhis Railway Station: రణరంగంగా ఢిల్లీ రైల్వేస్టేషన్.. డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్
ఇదిలా ఉంటే లోక్ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అసలైన దీపావళి నవంబర్ 14న చేసుకుంటామని తెలిపారు. సీట్ల పంకాల విషయంలో ఎన్డీఏ కూటమిపై అనేక ఊహాగానాలు వచ్చాయని.. ప్రస్తుతం ఎలాంటి గందరగోళం లేదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమిలోనే ప్రస్తుతం గందరగోళంగా ఉందని వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక విజయం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలతో తనకు ఒక్క శాతం కూడా వివాదం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 14న అసలైన దీపావళి చేసుకుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Rivaba Jadeja: ట్రెండింగ్‌గా రివాబా జడేజా.. కారణమిదే!
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు సజావుగానే సాగాయి. 243 స్థానాలకు గాను చెరో 101 స్థానాల్లో జేడీయూ, బీజేపీ పోటీ చేస్తుండగా.. లోక్‌జన్‌శక్తి పార్టీ మాత్రం 29 స్థానాల్లో పోటీ చేస్తోంది. హిందుస్థాన్ అవాం మోర్చా (హెచ్ఏఎం) ఆరుచోట్ల, రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్ఎల్ఎం) ఆరుచోట్ల బరిలో ఉన్నాయి. ఇండియా కూటమిలో మాత్రం చివరి నిమిషంలో విభేదాలు రావడంతో విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.