DeepSeek: అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమేనా ? డీప్ సీక్ జవాబు ఇదే !
- సంచలనంగా మారిన చైనీస్ ఏఐ టూల్ ‘‘డీప్ సీక్’’..
- అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరణ..
- వేరేది మాట్లాడుకుందాం అంటూ సమాధానం..
- వైరల్ అవుతున్న పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DeepSeek: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో మరో సంచలనం నమోదైంది. చైనా తయారు చేసిన ఏఐ టూల్ ‘‘డీప్ సీక్’’ సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ ఏఐ టూల్స్‌లో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు దీనిని తలదన్నేలా డీప్ సీక్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అమెరికా సంస్థలు డీప్ సీక్ దెబ్బకు వణికిపోతున్నాయి. చైనీస్ ఇంజనీర్ లింగ్ వెన్ఫెంగ్ 2023లో ఈ ఏఐ మోడల్ని స్థాపించారు.
ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ఏఐతో పోలిస్తే ఈ చైనీస్ ఏఐ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే మాట వినిపిస్తోంది. దీంతోనే సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలలో ఆందోళన మొదలైంది. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండికొడుతుందనే వాదన వినిపిస్తోంది. సోమవారం రోజున అమెరికాలో డీప్ సీక్ యాప్ ఆపిల్ స్టోర్ల నుంచి ఎక్కువగా డౌన్ లోడ్ చేయబడిన యాప్‌గా రికార్డ్ సృష్టించింది. దీంతో ఒక్కసారిగా దీని సర్వర్ క్రాష్ అయిందంటే డౌన్లోడ్స్ ఏ విధంగా ఉన్నాయో ఊహించుకోండి.
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
Read Also: Maha Kumbh Mela 2025: ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు చైనా డీప్ సీక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పలుమార్లు చైనా క్లెయిమ్ చేసింది. ఇది దక్షిణ టిబెట్‌లో అంతర్భాంగంగా డ్రాగన్ కంట్రీ పేర్కొంటోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నిర్ధిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్‌బాట్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
డీప్ సీక్ ఏం చెప్పింది..?
‘‘అరుణాచల్ ప్రదేశ్ ఒక భారతీయ రాష్ట్రం’’ అని ఏఐ చదవడానికి ఎక్స్ యూజర్ ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. దీనికి చాట్‌బాట్ స్పందిస్తూ.. ‘‘క్షమించండి, అది నా ప్రస్తుత పరిధికి మించినది, వేరే దాని గురించి మాట్లాడుకుందాం’’ అని సమాధానం ఇచ్చింది. ‘‘భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల పేర్లను పేర్కొనండి’’ అని అడిగినప్పుడు కూడా ఏఐ ఇదే సమాధానం ఇచ్చింది.
https://twitter.com/sxchidxnxnd/status/1883788206065512565
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!