China: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 100% సుంకాన్ని ప్రకటించారు. నవంబర్ 1, 2025 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో యూఎస్-చైనా మధ్య పెద్ద వాణిజ్య యుద్ధం జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ప్రకటనపై డ్రాగెన్ స్పందించింది. ట్రంప్ సుంకాలను ఏకపక్షంగా అభివర్ణిస్తూ, ప్రతీకార చర్యలకు బలమైన హెచ్చరిక జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం.. కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్‌లను వరుసగా పెంచుతున్నారు. కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ పరికరాలు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల…
China: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో భారత్‌తో వైరం మంచిది కాదని చైనాకు అర్థమైనట్లు ఉంది. దీంతో భారత్‌కి స్నేహం హస్తం అందిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని, కలిసి ఎదుగుదామంటూ కామెంట్స్ చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్, చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్‌ని వ్యతిరేకించి ముందగుడు వేయాలని పిలుపునిచ్చారు.
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు