డ్రాగన్ దేశం మరోసారి భారతదేశంతో కయ్యానికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయన్న తరుణంలో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. షక్స్‌గామ్ వ్యాలీ సరిహద్దు వివాదంతో భారత దేశాన్ని రెచ్చగొడుతోంది. చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.