బాలుడి కథ సుఖాంతం…భారత సైన్యానికి అప్పగించిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం అయింది. తరోన్ ని ఎట్టకేలకు చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ళ బాలుడు తరోన్ ఈ నెల 19 నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించాయి.
అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందించారు. సరిహద్దు ప్రాంతంలో మూలికల అన్వేషణ కోసం వెళ్లిన తరోన్ ను చైనా బలగాలు అపహరించాయని, మిగతావారు తప్పించుకున్నారని తెలిపారు. ఈ ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత తరోన్ తమ అధీనంలో ఉన్నాడంటూ భారత సైన్యానికి చైనా బలగాలు సమాచారం ఇవ్వడంతో అతడిని విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Also Read
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
విదేశాంగ శాఖ అధికారులు చైనా బలగాలతో పలుమార్లు సంప్రదింపులు జరపడంతో తరోన్ విడుదలపై ఆశలు పెరిగాయి. ఎట్టకేలకు చైనా అధికారులు స్పందించి అరుణాచల్ ప్రదేశ్ లోని వాచా-దమై ప్రాంతాల మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద చైనా తరోన్ ను భారత సైన్యానికి అప్పగించింది. తరోన్ అప్పగింతను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎంతో సామరస్యపూర్వకంగా, నేర్పుగా వ్యవహరించి బాలుడి విడుదలకు కృషి చేశారంటూ భారత సైన్యాన్ని మంత్రి అభినందించారు. తరోన్ కు వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తారు.
తాజావార్తలు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!