Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్ని టెర్రరిస్టులు దారుణంగా చంపేశారు. మతం, పేరు అడుగుతూ మరీ హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ సమయంలో భారత్కి అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, పుతిన్ వంటి ప్రపంచ నేతలు మృతులకు సంతాపం ప్రకటించారు.
Read Also: Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా.. రూ.10లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ ఘటనపై చైనా తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తన సానుభూతిని తెలియజేసింది. ‘‘బాధితులకు మేము సంతాపం తెలియజేస్తున్నాము. బాధితుల కుటుంబాలకు మరియు గాయపడిన వారికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. చైనా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.