Site icon NTV Telugu

Chhattisgarh: బీజాపూర్ భీకర ఎన్‌కౌంటర్‌.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..

Maoist Encounter

Maoist Encounter

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌ భీకర ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియస్ భాస్కర్ ఉన్నారు.

జూన్ 05,06, 07న బీజాపూర్ అడవుల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూన్ 05న 025న, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) సుధాకర్ @ గౌతమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 06న తెలంగాణ రాష్ట్ర కమిటీ (TSC) సభ్యుడు భాస్కర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజుల్లో మిగతా మావోయిస్టుల మృతదేహాలను లభ్యమయ్యాయి.

Read Also: Epstein Files: ట్రంప్‌పై “ఎప్‌స్టీన్ ఫైల్స్” పోస్ట్ డిలీట్ చేసిన మస్క్.. అసలేంటీ ఈ ‘‘సె*క్స్ స్కాండల్’’..

గౌతమ్, భాస్కర్‌తో పాటు గుర్తు తెలియని ఇద్దరు మహిళా మావోయిస్టులు, గుర్తుతెలియని ముగ్గురు పురుష మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఐదు గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహాల గుర్తింపును నిర్ధారించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎన్‌కౌంటర్ ప్రదేశాల నుండి రెండు AK-47 రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు, దండకారణ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాము కాట్లు, తేనెటీగల దాడులు, డీహైడ్రేషన్ వల్ల కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిందరికి ప్రస్తుతం వైద్య సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, మరోవైపు ప్రజాసంఘాలు ఎన్‌కౌంటర్లపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మరో 10 మంది మావోయిస్టుల భద్రతా బలగాల అదుపులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version