Chhatrapati Shivajiraje Bhosale: ఛత్రపతి శివాజీ మహారాజ్ పన్నెండవ తరం వారసుడు ఛత్రపతి శివాజీరాజే భోసలే వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా మంగళవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. అతని వయస్సు 75 ఏళ్లు. “ఛత్రపతి కుటుంబ వారసుడు, సతారా మాజీ మేయర్ ఛత్రపతి శివాజీరాజే భోసలే 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని రేపు సతారాలోని అదాలత్ వాడాలో చివరి దర్శనం కోసం ఉంచుతారు. గౌరవనీయులైన మేనమామకు హృదయపూర్వక నివాళి,” అంటూ ఆయన మేనల్లుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే ట్వీట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే శివేంద్ర రాజే భోసలే కూడా మృతి పట్ల సంతాపం తెలిపారు. సతారా మేయర్‌గా ఆయన చేసిన పని ఆదర్శనీయమని శివేంద్ర రాజే తన నివాళులర్పించారు.
Telangana Forest University: తెలంగాణలో తొలి ఫారెస్ట్ వర్సిటీకి బీజం.. ఛాన్స్‌లర్‌గా సీఎం కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోడీ ఛత్రపతి శివాజీరాజే భోసలే మృతిపట్ల సంతాపం తెలిపారు. సమాజం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. “ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిత్వం ఛత్రపతి శివాజీరాజే భోసలేది. సతారా పురోగతికి గొప్పగా కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని మోదీ ట్వీట్ చేశారు.మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఛత్రపతి శివాజీరాజే భోసలే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో కళలు, క్రీడలు, సాహిత్యం, సంస్కృతి, సమాజం లాంటి రంగాల్లో సేవలందించిన ఓ మంచి వ్యక్తిత్వాన్ని కోల్పోయామని మంగళవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు.