Viral: గత కొంత కాలంగా అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యం లోకి వస్తున్నాయి. గతంలో వివిధ ప్రదేశాల్లో వన్య మృగాలా దాడిలో ప్రజలు ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలా పులులు, చిరుతలు జనారణ్యం లోకి వచ్చి కల్లోలం సృష్టించిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ చిరుత పులి జనం మధ్య లోకి వచ్చి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్ లోని వరప్ గ్రామ సమీపంలో టాటా పవర్ కాంప్లెక్స్ ఉంది. ఆ కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తున్నది. కాగా పులి సంచారం కంపెనీ లోని సీసీ కెమెరా లో రికార్డు అయినది.
Read also:Telangana Elections 2023: ఇంటినుంచి ఓటేసేందుకు 28వేల మందికి పర్మిషన్
దీనితో కంపెనీ ఉద్యోగులు తీవ్ర బహయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులు చిరుతపులి సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం రాత్రి వేళల్లో నిర్వహించిన సోదాల్లో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కాగా చిరుతపులి అడవిలో దారి తప్పి జనావాస ప్రాంతానికి వచ్చిందని తెలిపిన టవీశాఖ అధికారులు.. కళ్యాణ్-ముర్బాద్ రోడ్ లోని వరప్ గ్రామ వాసులు,టాటా పవర్ కంపెనీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలానే రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లవద్దని కోరారు. కాగా ప్రస్తుతం చిరుతపులి సంచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.