BIG Breking: చెన్నై ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. చెన్నై ఆరక్కోణం సమీపంలో నిలిమి గ్రామంలో ద్రౌపది దేవి ఉత్సవాల్లో ఈఘటన చోటుచేసుకుంది. నిన్న ఆదివారం కావడంతో ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా దేవి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో దేవిని చూసి పులకించిపోయారు. విగ్రహాన్ని కన్నులారా చూసి తరించిపోయారు.
Read also: Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?
అయితే ఇంతలోనే అపశృతి చోటుచేసుకోవడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ద్రౌపతి దేవి ఉత్సవాల్లో భాగంగా క్రేన్ సహాయంతో చేస్తున్న దేవుడ్ని తీసుకెళుతున్న సమయంలో ఒక్కసారి అదుపు తప్పి క్రేన్ భక్తలపై పడింది. దీంతో నలుగురు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రలను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆనందంగా గడుపుతున్న సమయంలో ఈఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చనిపోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. క్రేన్ లో వ్యక్తిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఎలా జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు. విగ్రహం ఎక్కువ బరువు ఉండటం వలనా ఇలా జరిగిందా? క్రైన్ కు మనుషుల కూడా ఉండటం గమనించామని, అది క్రేన్ బరువు మోయలేకపోయిందా? అందుకే ఈఘటనకు దారితీసిందా? లేక క్రైన్ డ్రైవర్ తప్పిదమా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
Nagoba Jatara: నాగోబా జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నేడు పెర్సాపేన్, బాన్ పేన్ పూజలు