Allu Aravind Comments on Lavanya Thripati: ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి వీరి ప్రేమ గురించి ఎన్నో రోజుల నుంచి ప్రచారం ప్రచారం జరుగుతూనే ఉన్నా అసలు ఏమాత్రం స్పందించలేదు కానీ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలో ఆమె మొదటి సినిమా టైంలో మంచి తెలుగబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోమని అల్లు అరవింద్ సలహా ఇచ్చిన వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా ఆ వీడియో మీద అల్లు అరవింద్ స్పందించారు. తాజాగా జరిగిన ‘బేబీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ హీరోయిన్ వైష్ణవి చైతన్య పై ఫన్నీ కామెంట్స్ చేశారు.
Manchu Mohan babu : మీడియాపై మోహన్‌బాబు ఫైర్.. లోగోలు లాక్కోమని?
కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన యాంకర్ మూవీలో హీరోయిన్ పాత్ర గురించి చెప్పమని అడగ్గా.. ఈ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెళ్లి చేసుకోవద్దు అంటూ వైష్ణవి చైతన్య కు సలహా ఇచ్చారు అల్లు అరవింద్. వైష్ణవికి ఇంకా మంచి భవిష్యత్ ఉందని, కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి ఆలోచన చేసుకోవాలని అన్నారు. తాను ఇలాగే తన బ్యానర్ లో మూడు సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ని ఇక్కడే మంచి తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమంటే ఆమె మా వాడినే లవ్ చేసిందని వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక బేబీ సినిమా జులై 14 న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతానని చెబుతున్నాడు ఆనంద్ చూడాలి మరి ఏమవుతుందో?\