Chandigarh: బయటపడ్డ చండీగఢ్ రిటర్నింగ్ అధికారి బండారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాలెట్ పత్రాలను అటు ఇటుగా మార్చేయడంతో పాటు కొన్నింటిని తప్పుగా చేసిన వ్యవహారం ఇప్పుడు బయటపడింది.
తాజాగా ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారంటూ ధ్వజమెత్తింది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై (Chandigarh Mayor Elections) దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి తీరుపై (Returning Officer) ఫైర్ అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన వీడియోగ్రఫీ సహా అన్ని బ్యాలెట్ పత్రాలు, ఇతర ఒరిజినల్ రికార్డులను పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయడాన్ని అనుమతించబోమంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 7న జరగాల్సిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ఇదే అంశంపై ప్రియాంక ట్వీట్..
చండీగఢ్ ఉదంతాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల మోసాన్ని ధర్మాసనం ఖండించిందని.. ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేసినట్లుగా చీవాట్లు పెట్టిందని గుర్తుచేశారు. ప్రజల గొంతును అణిచివేసేందుకు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని.. ప్రజలు దీనికి సమాధానం చెబుతారని ప్రియాంక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జిమ్మిక్ జరిగింది. ఇండియా కూటమిగా బరిలో దిగిన ఆప్, కాంగ్రెస్ పార్టీలకు 20 మంది (13+7) కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి చెందిన మనోజ్ కుమార్ సోలంకి కేవలం 16 ఓట్లే ఉన్నాయి. కానీ బీజేపీ అభ్యర్థే మేయర్‌గా ఎన్నికయ్యాడు. దీంతో ఇండియా కూటమి అవాక్కైంది.
ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు 20 మంది మద్దతు ఉన్నా.. 12 ఓట్లే వచ్చాయి. కూటమికి చెందిన 8 ఓట్లు చెల్లలేదని అధికారి ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఆప్, కాంగ్రెస్ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి తీరుపై మండిపడ్డారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టి ప్రిసైడింగ్ అధికారి తీరుపై మండిపడింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!