Medicine Prices: ఏప్రిల్ నుంచి మెడిసిన్ ధరల పెంపు అంతా ఉత్తదే.. కేంద్రం క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medicine Prices: ఏప్రిల్ నెల నుంచి దేశంలో పలు రకాల మెడిసిన్స్‌పై ధరలు పెరుగుతాయని ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీడియాలో మందుల ధరలపై వచ్చిన కథనాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. మెడిసిన్ ధరల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని చెప్పిన మీడియా నివేదికలను ‘‘తప్పుడు, తప్పుదోవ పట్టించేవి, హానికరమైనవి’’గా బుధవారం పేర్కొంది.
కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఔషధాల ధరలు 12శాతం చొప్పున పెరుగుతాయని నివేదించింది. ఇది 500 కంటే ఎక్కువ మందుల్ని ప్రభావితం చేస్తాయని తెలిపాయి. అయితే ఇదంతా ఉత్తదే అని, టోకు ధరల సూచి(WPI) ఆధారంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) ఏటా షెడ్యూల్ చేసిన మందుల సీలింగ్ ధరలను సవరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ‘‘WPI పెరుగుదల 0.00551 శాతం ఆధారంగా, 782 ఔషధాల కోసం ప్రస్తుత సీలింగ్ ధరలలో ఎటువంటి మార్పు ఉండదు, అయితే 54 ఔషధాలపై రూ. 0.01 (ఒక పైసా) స్వల్ప పెరుగుదల ఉంటుంది’’ అని తెలిపింది.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 7న ఆప్ నిరాహార దీక్ష
ఈ 54 మెడిసిన్స్ సీలింగ్ ధర రూ. 90 నుంచి రూ. 261 వరకు ఉంటుంది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్స్ (డిపిసిఓ) 2013 నిబంధనల ప్రకారం డబ్ల్యూపీఐ పెంపు అనుమతించదగిన గరిష్ట పెంపుదల అని, తయారీదారులు పెంపు తక్కువగా ఉండటంతో మందుల ధరల్ని పెంచొచ్చు, పెంచకపోవచ్చు అని మంత్రిత్వశాఖ తెలిపింది. అందువలన, FY 2024-25 సంవత్సరంలో, WPI ఆధారంగా ఔషధాల సీలింగ్ ధరలో దాదాపు ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. తమ ఔషధాల సీలింగ్ ధరపై ఆధారపడి, కంపెనీలు తమ గరిష్ట రిటైల్ ధర (MRP)ని MRP (GST మినహాయించి) సీలింగ్ ధర కంటే తక్కువ ధరగా మార్చవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని, ధరల వివవరాలు NPPA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ధరలు మార్చి 31, 2025 వరకు కొనసాగుతాయి.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!