Health Warning: ఇప్పటివరకు పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, పాన్ మసాలా ప్యాకెట్లపై ‘పొగాకు ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక ఉండేది. ఇకపై కొత్త హెచ్చరిక అమల్లోకి రానుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలను సవరించింది. 2022 డిసెంబరు 1న లేదా ఆ తర్వాత తయారయ్యే, దిగుమతి చేసుకునే లేదా ప్యాకేజ్ అయ్యే పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై అక్షరాలు, బొమ్మల రూపంలో కొత్త హెచ్చరికలను ముద్రించాలని ఆదేశించింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సవరించిన నియమాలు డిసెంబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయి.
ఈ ప్రకటన ప్రకారం డిసెంబర్ 1 నుంచి తయారయ్యే పొగాకు ఉత్పత్తులపై ‘పొగాకు బాధాకరమైన మరణానికి కారణమవుతుంది’ అనే వచన ఆరోగ్య హెచ్చరికతో పాటు ప్రభుత్వం అందించిన చిత్రాలను ముద్రించాలి. వచ్చే ఏడాది డిసెంబర్ 1 నుంచి దిగుమతి చేసుకునే లేదా ప్యాకేజ్ అయ్యే పొగాకు ఉత్పత్తుల పెట్టెలపై ‘పొగాకు వినియోగదారులు తక్కువ వయసులోనే మరణిస్తారు” అని అక్షరాలతో పాటు ప్రభుత్వం అందించిన చిత్రాలను ముద్రించాలి.
Arpita Mukherjee: నటి అర్పితా ముఖర్జీకి నాలుగు లగ్జరీ కార్లు.. వాటి నిండా డబ్బే!
సిగరెట్లు లేదా ఏదైనా పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, దిగుమతి లేదా పంపిణీలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిమగ్నమై ఉన్న ఏ వ్యక్తి అయినా, అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలు నిర్దేశించిన విధంగానే నిర్దేశించిన ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉండేలా చూసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003లోని సెక్షన్ 20లో సూచించిన విధంగా జైలు శిక్ష లేదా జరిమానాకు శిక్షార్హులని ఈ ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ (ప్యాకేజీ, లేబులింగ్) నిబంధనలు-2008లో ఈ మేరకు సవరణలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. సవరించిన నిబంధనలు 2022 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్ 19 భాషల్లో అందుబాటులో ఉంది.