Zika virus: మహరాష్ట్రలో ‘జికా వైరస్’ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. జూలై 1 నాటికి పూణేలో 6 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. గర్భిణీ స్త్రీలకు జికా వైరస్ పరీక్షలు నిర్వహించాలని, జికా వైరస్ పాజిటివ్‌గా తేలితే తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలనున కోరింది.
Read Also: CM Chandrababu: ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై సమీక్ష.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఇందుకు హెల్త్ ఫెసిలిటీస్, ఆస్పత్రులు ఆదేశాలు జారీ చేయాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు మరియు ఆరోగ్య సౌకర్యాలలో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యక్రమాలనున తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
జూలై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్ సోకింది. నగరంలోని ఎరంద్‌వానే ప్రాంతంలో నాలుగు, ముంధ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఏడెస్ దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇదే దోమ కారణంగా డెంగ్యూ, చికెన్ గున్యా ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. 1947లో తొలిసారిగా ఉగాండాలో జికా వైరస్‌ని గుర్తించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో జికా వైరస్ పిండం ఎదుగుదల, మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది.