అవసరమైతే కర్ఫ్యూ విధించండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో “ఒమిక్రాన్”!వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాసారు. “కొవిడ్” నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న కేంద్రం… కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరో 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు లేఖలో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
అయితే జిల్లాల్లో కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని సూచించింది. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలి. “కంటైన్మెంట్ జోన్లు”గా పరిగణించి..అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని… అలాగే జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.
Also Read
- Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
తాజావార్తలు
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్‌కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..