Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. త్వరలో పీఎంశ్రీ స్కూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ పొందడం ప్రస్తుత మన విద్యా విధానం. మున్ముందు కోర్సు అవగానే కొలువులు సాధించేలా విద్యార్థులు సుశిక్షితులు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానానికి ఈ పాఠశాలలు ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయని ఆయన అభివర్ణించారు.
Central Government: సామాన్యులకు షాక్.. వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేత
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గుజరాత్‌లో జరిగిన నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రసంగంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రకటన చేశారు. నాలెడ్జ్ ఎకానమీగా ఇండియాని రూపొండించడంలో రాబోయే 25 సంవత్సరాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల విద్య అనేది విద్యార్థికి పునాది వంటిదని.. అత్యాధునిక సదుపాయాలతో పీఎం స్కూల్స్ స్థాపిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ వరకు ఎన్‌ఈపీ 5+3+3+4 విధానం, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ECCE), టీచర్ ట్రైనింగ్, వయోజన విద్య, పాఠశాల విద్యతో నైపుణ్యాభివృద్ధిని ఏకీకృతం చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కాగా నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలో అన్ని భాషలు దేశీయ భాషలేనని అన్నారు. ఏ భాష కూడా హిందీ, ఇంగ్లీష్ కంటే తక్కువేమీ కాదన్నారు. ప్రతి భాషకు దానిదైన ప్రత్యేకత, గుర్తింపు ఉంటుందని.. అందుకే నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు కూడా ప్రాముఖ్యత కల్పించామని వివరించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!