Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు.. ఎందుకంటే?
- అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు
- యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం విషం కలిపిందని ఆరోపణలు
- షాబాద్ కు చెందిన జగ్మోహన్ అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం చూపు ఇప్పుడు ఢిల్లీపై పడింది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. కేసుకు గల కారణం ఏంటంటే యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హర్యానాలో కేసు నమోదైంది.
ఇటీవల కేజ్రీవాల్ యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గట్టిగానే స్పందించారు. ఏకంగా యమునా నీటిని తాగి విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ సైతం కేజ్రీవాల్ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Also Read
తాజాగా షాబాద్ కు చెందిన జగ్మోహన్ అనే లాయర్ కేజ్రీవాల్ పై కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు బీఎన్‌ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!