Tejasvi Surya: బెంగళూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. ఈ రోజు జరిగిన పోలింగ్‌లో మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ బెంగళూర్‌లోని జయనగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎక్స్ వేదికగా ‘‘మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించే’’ వీడియోను పోస్ట్ చేసినట్లు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు.
Read Also: Supreme Court: భార్య తెచ్చిన “స్త్రీధనం”పై భర్తకు హక్కు లేదు..
ఎన్నికల్లో ఓటేసినత తర్వాత తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 30 సీట్లకు మించి గెలవకపోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పూర్తిగా నిరుత్సాహానికి గురైందని, 30 సీట్లకు మించి గెలవలేమని సర్వే తర్వాత సర్వేలు చెబుతున్నాయి… ప్రధాని (నరేంద్ర మోదీ)పై వారు చేస్తున్న వ్యక్తిగత దాడులు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే ప్రధాని మోడీకి, బీజేపీకి మరింత ప్రజాదరణ దక్కుతోంది’’ అని ఆయన అన్నారు.
బెంగళూర్ సౌత్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరుపున తేజస్వీ సూర్య పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ సౌమ్యా రెడ్డిని రంగంలోకి దింపింది. ఈ ఏడాది ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు, యువకులు పెద్ద ఎత్తున ఓటు వేయాలని సూర్య కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో నేడు 14 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.