ఆదివారం జరగనున్న నీట్ పరీక్షను వాయిదా వేయాలని కొంత మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం విచారించిన న్యాయస్థానం.. పిటిషన్లను తిరస్కరించింది. దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షను వాయిదా వేసేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. తాజా తీర్పుతో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11న (ఆదివారం) ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష వాయిదా కోరుతూ పిటిషన్లు వేసిన వారి తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు.
ఇది కూడా చదవండి: Michelle poonawalla: ముంబైలో రూ.500 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
గత ఏడేళ్లుగా నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు. అయితే, నీట్-యూజీ 2024 పరీక్షపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా 185 నగరాల్లో ఆగస్టు 11న కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు షిప్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఆధారంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇది కూడా చదవండి: MP High Court: భార్య వంట చేయకపోవడం, భర్తను బట్టలు ఉతకమనడం.. ఆత్మహత్యకు కారణాలు కావు..